సాంకేతికపరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఇప్పుడు ఆయన ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తీస్తున్న భారీ బడ్జెట్ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. తనదైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
ప్రభాస్ సినిమా కోసం దిగ్గజ దర్శకుడు 'సింగీతం' - PRABHAS MOVIE NEWS
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మెంటార్‌గా ఉండనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
ప్రభాస్ కొత్త సినిమా
సోమవారం సింగీతం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ఆయన సృజనాత్మక ఆలోచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబరు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. 2022లో ప్రేక్షకులు ముందుకు రానుంది.