తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్​ సినిమాలో నాని డైలాగ్​ అదుర్స్​ - జగపతి బాబు

'ద లయన్ కింగ్​' తెలుగు వెర్షన్​లో సింబా పాత్ర టీజర్​ను హీరో నాని ట్విట్టర్​లో పంచుకున్నాడు. 'నేను సింబా.. ముఫాసా కొడుకుని' అని డబ్బింగ్ చెప్పిన నాని సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు.

నేను సింబా... ముఫాసా కొడుకుని

By

Published : Jul 9, 2019, 4:28 PM IST

ప్రఖ్యాత డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'ద లయన్ కింగ్'. ఇంగ్లీష్​తో పాటు భారతీయ భాషల్లోనూ విడుదలకు సిద్ధమవుతోంది. జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు క్రేజ్​ తెచ్చేందుకు ప్రాంతీయ భాషల్లో ప్రముఖ నటులతో అందులోని పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.

తెలుగు వెర్షన్​లో ముఫాసా కొడుకైన సింబా పాత్రకు నేచురల్‌ స్టార్‌ నాని డబ్బింగ్‌ చెప్పాడు. తన పాత్ర టీజర్‌ను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నేచురల్ స్టార్.

"మా నాన్న ఒకసారి చెప్పారు. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని" అంటూ నాని డబ్బింగ్‌ చెపుతున్న దృశ్యాలతో టీజర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత అడవి రాజు ముఫాసా తన వారసుడు సింబా అని అడవిలోని జంతువులకు పరిచయం చేయడం, అనంతరం ‘‘నేను సింబా, ముఫాసా కొడుకుని’’ అనే సన్నివేశంతో టీజర్‌ ముగిసింది.

ఇందులోని ఇతర పాత్రలకు జగపతిబాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ తదితరులు డబ్బింగ్ చెప్పారు.

ఇది చదవండి: 'మన్మథుడు 2'లో ధూమపానంతో రకుల్​ రచ్చ

ABOUT THE AUTHOR

...view details