Silk smitha death: గ్లామర్ ప్రపంచంలో ఆమె ఓ సెన్షేషన్. తన ముద్రతో విజయం సాధించినప్పటికీ.. తన పేరులోని విజయ మాత్రం జీవితంలో చూడలేకపోయింది. తళుకుబెళుకుల రంగుల ప్రపంచంలో అమయాకమైన చిరునవ్వు మిగిల్చి తనను తాను అంతం చేసుకుంది. ఎప్పటికీ తిరిగిరాని లోకాలను తరలిపోయింది. తెరపై కనిపించేదంతా అబద్ధమని, తన చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి జీవితాన్ని విషాదాంతం చేసుకుంది. ఆమెనే సిల్క్ స్మిత. గురువారం ఆమె జయంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
- సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. 1960 డిసెంబరు 2న పుట్టింది.
- చిన్న వయసులోనే ఈమెకు పెళ్లి చేశారు. భర్త, అత్తామామలు ఈమెను వేధింపులకు గురిచేయడం వల్ల ఇంటి నుంచి పారిపోయింది.
- టచప్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత తన అందం అభినయంతో ఎందరికో ఆరాధ్య నటిగా మారింది.
- దక్షిణాదిలో ఎక్కువగా సినిమాలు చేసిన ఈమె.. తొలుత సహాయ పాత్రలు చేసింది. 1979లో 'వండి చక్రం' అనే తమిళ సినిమాలో 'సిల్క్' పాత్రలో నటించి ఆ పేరునే తన స్క్రీన్‌నేమ్‌గా మార్చుకుంది.
- 17 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 450 సినిమాల్లో నటించింది.
- కేవలం డ్యాన్సర్‌గానే కాకుండా నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ కనిపించి, ప్రేక్షకుల్ని మెప్పించింది.
- సిల్క్ స్మితకు స్నేహితులు చాలా తక్కువ. ఎవరితోనూ అంత త్వరగా స్నేహం చేసేది కాదు. చివరివరకు ఈమె ఒంటరిగానే ఉండిపోయింది.
- 1996 సెప్టెంబరు 23న ఇంట్లోనే మరణించింది. ఎందుకు తనువు చాలించింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆ తర్వాత వచ్చిన పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో తేలింది.
- ఈమె జీవితం ఆధారంగా 'డర్టీ పిక్చర్' పేరుతో 2011లో హిందీ సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమె పాత్ర పోషించిన విద్యాబాలన్.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది.