అనుష్క, మాధవన్ ప్రధానపాత్రలో 'సైలెన్స్' అనే చిత్రం తెరకెక్కనుంది. తెలుగులో ఈ చిత్రానికి 'నిశ్శబ్దం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ నేడే ప్రారంభమైంది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
అనుష్క 'నిశ్శబ్దం' షూటింగ్ ప్రారంభం.. - cinema
అనుష్క, మాధవన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ నేడే ప్రారంభమైంది.
![అనుష్క 'నిశ్శబ్దం' షూటింగ్ ప్రారంభం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3377715-thumbnail-3x2-silence.jpg)
సైలన్స్
తెలుగు,తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలు పోషించనున్నారు. సస్పెన్స్.. థ్రిల్లర్ కథాంశంతో సినిమా రూపొందనుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇవీ చూడండి.. 'మార్పు కోసం ప్రయత్నించేవాడే నాయకుడు'