తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ గదిలో 'నిశ్శబ్దం'.. ఒంటరిగా అనుష్క - సైలెన్స్

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలోని ఓ లుక్ ఆకట్టుకుంటోంది. చిత్రంపై ఆసక్తి రేపుతోంది.

ఆ గదిలో 'నిశ్శబ్దం'.. ఒంటరిగా అనుష్క

By

Published : Jul 3, 2019, 4:22 PM IST

హీరోయిన్​ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. సినిమాలోని ఓ లుక్​ను తన ఇన్​స్టాలో పంచుకుంది. ఏకాంతంగా ఉన్న గదిలో డార్క్​లైట్ నీడలో ఓ పుస్తకం పట్టుకుని నిలబడి ఉందీ భామ. ఈ స్టిల్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. తెలుగు, తమిళం,హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

నిశ్శబ్దం చిత్రంలోని అనుష్క లుక్

మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ నటుడు మైఖేల్‌ మాడ్సెన్, అంజలి, శాలిని పాండే, సుబ్బరాజ్​ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందీ చిత్రం. గోపీ సుందర్‌ సంగీత దర్శకుడు. పీపుల్‌ మీడియా, కోన వెంకట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క పాత్రేమిటి..?

ABOUT THE AUTHOR

...view details