8వ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ) అవార్డుల వేడుక కోసం ఖతార్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15, 16 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దక్షిణాది చిత్రసీమకు చెందిన అతిరథ మహారథులంతా తరలి రాబోయే ఈ మహోత్సవం కోసం ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మలయాళ హీరో మోహన్‌లాల్ వస్తున్నట్లు.. సైమా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
'సైమా'కు ముఖ్య అతిథులుగా చిరంజీవి-మోహన్‌లాల్ - ఖతారు
ఖతార్‌లో ఈ నెల 15,16 తేదీల్లో జరిగే సైమా వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, మలయాళ నటుడు మోహన్‌లాల్ హాజరు కానున్నారు.
సైమా ముఖ్య అతిథులుగా చిరంజీవి-మోహన్‌లాల్
ఆగస్టు 15న తెలుగు, కన్నడ చిత్రసీమలకు సంబంధించి జరిగే అవార్డు వేడుకలో చిరు సందడి చేయనున్నాడు. 16వ తేదీన జరిగే తమిళ, మలయాళ పురస్కారాల వేడుకకు మోహన్‌లాల్ ముఖ్య అతిథిగా రానున్నాడు.
ఇది చదవండి: అధీరా పాత్రకు సంజయ్‌దత్ సరైనోడని చెప్పిన హీరో యశ్