సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు నిర్వహించలేదు. దాంతో మళ్లీ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నటులు, ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. 2021 అవార్డుల కార్యక్రమం ఎప్పుడుంటుందో సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది.
'మీ నిరీక్షణకు తెరపడింది! సైమా అవార్డ్స్ వేడుకలు తిరిగి వచ్చాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండగ జరుపుకొందాం' అని పేర్కొంది. ఈ వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. 2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలైంది.
హైదరాబాద్లోనే..