తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా మృతి.. షాక్​లో ఫ్యాన్స్ - bigg boss siddharth shukla

sidharth shukla
సిద్దార్థ్ శుక్లా

By

Published : Sep 2, 2021, 11:39 AM IST

Updated : Sep 2, 2021, 1:40 PM IST

11:38 September 02

ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్లా (40) కన్నుమూశారు(sidharth shukla died). ఉదయం 10.30 గంటలకు ముంబయిలోని ఆస్పత్రిలో తీసుకురావడానికి ముందే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్​కు గురయ్యారు.

మోడల్​గా పరిచమైన సిద్దార్థ్(sidharth shukla age).. బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)(balika vadhu cast)తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఝలక్ దిఖ్లా జా 6', బిగ్​బాస్ 13(bigg boss siddharth shukla)షోలో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించారు. బాలీవుడ్​ బిగ్​బాస్​ 13వ సీజన్​లో విజేతగానూ నిలిచారు. అలాగే కరణ్ జోహర్ నిర్మించిన 'హంప్టీ శర్మా కీ దుల్హానియా' చిత్రంలో సహాయ నటుడి పాత్రలో మెరిశారు.

ఏం జరిగింది?

సిద్దార్థ్ శుక్లాను ఉదయం 10.30 గంటలకు ముంబయిలోని కూపర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధరించారు వైద్యులు. సిద్దార్థ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. మృతికి కారణం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని వైద్యులు వెల్లడించారు.

Last Updated : Sep 2, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details