తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొయ్యల కూర చేసిన బాలీవుడ్ హీరో - సిద్ధార్థ్​ మల్హోత్రా న్యూస్​

బాలీవుడ్​ కథానాయకుడు సిద్ధార్థ్​ మల్హోత్రా వంటిట్లో గరిట పట్టాడు. స్వీయ నిర్బంధంలో భాగంగా ఇంటికే పరిమితమైన హీరో​.. తను వంట చేసిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Sidharth Malhotra tries cooking prawn during social distancing
స్వీయనిర్బంధంలో వంట చేస్తున్న సిద్ధార్థ్​ మల్హోత్రా

By

Published : Mar 22, 2020, 12:31 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు రద్దయ్యాయి. ఫలితంగా నటీనటులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా ఓ వంట వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు బాలీవుడ్​ హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా. మొదటిసారి వంట చేస్తున్నట్టు అందులో తెలిపాడు.

"కొత్తగా ఏదైనా చేయడానికి వెనుకాడకూడదు. నా మొదటి ప్రయత్నంగా బటర్​ గార్లిక్​ రొయ్యల కూర తయారు చేశాను. తొలిసారి వండినా అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఇంకా ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను."

- సిద్ధార్థ్​ మల్హోత్రా, బాలీవుడ్​ హీరో

సిద్ధార్థ్​.. ఇటీవల 'మర్​జావాన్'​ సినిమాతో తెరపై కనువిందు చేశాడు. ప్రస్తుతం పరమవీర చక్ర అవార్డు విజేత, ఆర్మీ కెప్టెన్​ విక్రమ్​ భాత్రా జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'షెర్షా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రాభియం చేయనున్నాడు. తమిళ దర్శకుడు​ విష్ణువర్ధన్​ ఈ చిత్రంతో బాలీవుడ్​లో అడుగుపెడుతున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇదీ చూడండి..'అబద్ధం' చెప్పారని పవన్​, రజనీ ట్వీట్స్​ డిలీట్

ABOUT THE AUTHOR

...view details