తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫస్ట్​లుక్: స్టైలిష్ గెటప్​లో సిద్దార్థ్.. - sidharth

'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు సిద్దార్థ్. కానీ తర్వాత వరుస ఫ్లాపులతో తన మార్కెట్​ను కోల్పోయాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న 'టక్కర్' ఫస్ట్​లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది.

sidharth
సిద్ధార్థ్

By

Published : Dec 24, 2019, 10:44 AM IST

విదేశాల్లో పెరిగిన యువకుడు ప్రేమ కోసం వ్యవసాయం చేస్తాడు.. ఎన్నో కష్టాలు పడతాడు.. ఎక్కడో విన్నట్టూ.. చూసినట్టూ ఉంది కదా! అవును 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో సిద్దార్థ్ పాత్ర ఇది. మొత్తం మీరే చేశారు నాన్నగారూ.. అంటూ 'బొమ్మరిల్లు'లోనూ యువతను అమితంగా ఆకట్టుకున్నాడీ హీరో​. అయితే ఈ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా తర్వాత వరుస ఫ్లాపులతో తన మార్కెట్​ను కోల్పాయాడు.

తమిళంలో రాణిస్తున్నాడు

తెలుగులో వరుస ఫ్లాపుల్లో ఉన్న సిద్దార్థ్ తమిళంలో రాణిస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన తమిళ చిత్రం 'అరువం' తెలుగులో 'వదలడు' పేరుతో విడుదలైంది. హర్రర్​ క్రైమ్​ థ్రిల్లర్​గా వచ్చిన ఈ సినిమాలో సిద్దార్థ్​ పుడ్​ ఇన్​స్పెక్టర్​గా నటించాడు.

తమిళంలో 'టక్కర్​'..

తమిళంలో జోరుగా సినిమాలు చేస్తున్న సిద్దార్థ్ 'టక్కర్​' అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్​ జి క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫ్యాషన్​ స్టూడియోస్​ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్​ లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్​లో స్టైలిష్​ లుక్​లో కనిపించాడీ హీరో. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ.

టక్కర్ ఫస్ట్​లుక్

ఇవీ చూడండి.. 'రంగస్థలం' హీరోని చేసింది: శ్రీసింహ

ABOUT THE AUTHOR

...view details