శర్వానంద్-సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహాసముద్రం'. అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ప్రేమతో కూడిన యాక్షన్ డ్రామా కథగా సినిమా తెరకెక్కుతోంది. శనివారం హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
'మహాసముద్రం'లో సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్.. 'నల్లమల' థీమ్ సాంగ్ - మహాసముద్రం సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'మహాసముద్రం' సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్ సహా 'నల్లమల' థీమ్ సాంగ్ అప్డేట్స్ ఇందులో ఉన్నాయి.
'మహాసముద్రం'లో సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్.. 'నల్లమల' థీమ్ సాంగ్
ప్రతినాయకుడు అమిత్ తివారి ప్రధానపాత్రలో బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ కథానాయికగా నటిస్తోన్న చిత్రం 'నల్లమల'. ఈ సినిమాలోని థీమ్ సాంగ్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు.
ఇదీ చూడండి:అమ్మో.. అమ్మాయేనా! ఎల్లోరా శిల్పమా?