తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మంత్రుల వ్యాఖ్యలపై హీరో సిద్దార్థ్ సెటైర్లు! - Siddharth bommarillu

AP ticket issue: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సినిమా టికెట్, ఖర్చుల వివాదంపై హీరో సిద్దార్థ్ స్పందించారు. మంత్రులు విలాసాల ఖర్చులు తగ్గించుకోవాలని ట్వీట్ చేశారు.

Siddharth Slams Politicians
హీరో సిద్దార్థ్

By

Published : Dec 24, 2021, 3:34 PM IST

Updated : Dec 24, 2021, 3:45 PM IST

Siddharth tweet recent: ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకు హాట్‌ టాపిక్‌గా మారుతోంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌‘ మీడియా సమావేశంలో నటుడు నాని ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై అసహనం వ్యక్తం చేశారు. ‘రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు టికెట్ల ధరలు తగ్గించడంపై నటుడు సిద్ధార్థ్‌ మంత్రులపై సెటైర్లు వేశాడు. ‘‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్‌ అందిస్తున్నామని మంత్రులు అంటున్నారు. మరి మేం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంతమంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్‌ ఇవ్వండి’’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌లో సిద్ధార్థ్‌ ఎవరి గురించి అంటున్నది చెప్పలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే టికెట్‌ రేట్ల సమస్య నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ మాటలు ఏపీ మంత్రులను ఉద్దేశించి చేసినవే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇది చదవండి:హీరో సిద్ధార్థ్​ను చంపేస్తామని బెదిరింపులు

Last Updated : Dec 24, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details