Siddharth on ticket price: సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంపై నటుడు సిద్ధార్థ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని.. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా #SaveCinema అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.
"25 సంవత్సరాల క్రితం మొదటిసారి విదేశాల్లో సినిమా చూశాను. నా స్టూడెంట్ ఐడీ కార్డు ఉపయోగించి అప్పట్లోనే ఎనిమిది డాలర్లు అంటే రూ.200 చెల్లించి ఆ సినిమా చూశా. ఇప్పుడు మనం నిర్మిస్తున్న చిత్రాలు టెక్నాలజీ, టాలెంట్‌లో మిగతా దేశాల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. సినిమా టికెట్లు, పార్కింగ్ రేట్లపై ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు. సినిమా కంటే మద్యం, పొగాకుకు మీరు ఎక్కువ గౌరవమిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దురాచారాన్ని ఆపండి. ఎన్నో వేల మంది ప్రజలు పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. మా వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో మీరు మాకు చెప్పకండి. పన్నులు, సెన్సార్ విషయంలో మీరు ఏం చెప్పినా వింటాం. కానీ, నిర్మాతలు, వాళ్ల ఉద్యోగులకు జీవనోపాధి లేకుండా చేయకండి."
-సిద్ధార్థ్, సినీ నటుడు