మోడల్‌గా ప్రస్థానం ప్రారంభించి, అతి తక్కువ కాలంలోనే వెండితెరపై తనదైన ముద్రవేసిన భామ దీపికా పదుకొణె. పాత్రలో కొత్తదనం ఉంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరితోనైనా కలిసి నటించేందుకు సిద్ధమవుతోంది. అలా ఇప్పుడు సిద్ధాంత్ చతుర్వేది అనే నటుడితో తెర పంచుకోనుందట. ఈ సినిమాకు కరణ్‌జోహర్ నిర్మాత. శకున్ బత్రా దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. శకున్.. ఇంతకుముందు 'ఏక్ మైన్ ఔర్ ఏక్ తో', 'కపూర్ అండ్ సన్స్' చిత్రాలతో ఆకట్టుకున్నాడు.
అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుందీ సినిమా. గతంలో 'గల్లీబాయ్'లో షేర్ అనే పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించాడు సిద్ధాంత్.