లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది.. ఇన్‌స్టా ద్వారా తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. స్వయంగా తన గొంతుతో పాడిన ఓ పాటను వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. సిద్ధాంత్ పాడిన తొలి పాట ఇది. ఇన్‌స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇందులో బెడ్‌పై ఓ గిటార్ పట్టుకుని పడుకుని ఏదో ఊహల్లో తేలుతున్నట్లుగా కనిపించాడీ నటుడు.
"ఈ ఖాళీ సమయంలో ఏదైనా చేయాలని ఆలోచించాను. నేనే ఓ పాట పాడితే ఎలా ఉంటుంది? అని భావించా.. సరే.. ప్రజల కోసం ఏదైనా చేయాలి" అంటూ వ్యాఖ్య జోడించాడు.