తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దీపికతో సినిమా.. సంతోషం పట్టలేకపోతున్నా' - దీపికా పదుకొణె- సిద్ధాంత్ చతుర్వేది కొత్త సినిమా

దీపికతో కలిసి నటిస్తున్న యువనటుడు సిద్ధాంత్ చతుర్వేది.. ఆనందాన్ని అదుపుచేసుకోలేకపోతున్నానని అన్నాడు. వీరిద్దరూ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్​టైనర్​కు శకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్నారు.

'దీపికతో సినిమా.. ఆనందం తట్టుకోలేకపోతున్నా'
దీపికా పదుకొణె- సిద్ధాంత్ చతుర్వేది

By

Published : Jun 24, 2020, 10:35 AM IST

'గల్లీబాయ్'లో ఎమ్​సీ షేర్​గా మెప్పించిన నటుడు సిద్ధాంత్ చతుర్వేది.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఆమెతో కలిసి నటిస్తున్నప్పుడు సంతోషం అదుపు చేసుకోలేకపోతున్నానని అన్నాడు. దీనితోపాటే సైఫ్-రాణీముఖర్జీలతో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ 2'లోనూ ఓ కథానాయకుడిగా కనిపించనున్నాడు.

"నేను నటిస్తున్న కొత్త సినిమాల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత 'బంటీ ఔర్ బబ్లీ 2'ను పూర్తి చేస్తాం. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్​టైనర్" -సిద్ధాంత్ చతుర్వేది, యువనటుడు

దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్న సినిమా జానర్​ ఇంతవరకు బాలీవుడ్​లో రాలేదని చెప్పాడు సిద్ధాంత్.

"ఇలాంటి జానర్​ ఇంతవరకు బాలీవుడ్​లో రాలేదు. శకున్ బత్రా మంచి దర్శకుడు. ఈ చిత్రాన్ని సమకాలీన అంశాలతో తెరకెక్కిస్తున్నారు. మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. దీపికతో కలిసి ఇప్పటికే నటించాను. ఆమెతో మాట్లాడాలని ప్రతి కుర్రాడు కోరుకుంటాడు. అలాంటిదని నేను కలిసి పనిచేస్తున్నా. ఈ క్రమంలో ఆనందాన్ని అదుపుచేసుకోలేకపోతున్నా" -సిద్ధాంత్ చతుర్వేది, యువనటుడు

కరోనా ప్రభావం నేపథ్యంలో మార్చి నుంచి సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో తిరిగి షూటింగ్​లు ప్రారంభించేందుకు పలువురు దర్శక-నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details