Nani about AP Tickets issue: ఏపీ సినిమా టికెట్ల విషయమై సంచనల వ్యాఖ్యలు చేశారు హీరో నాని. టికెట్ రేట్లను తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.
"(టికెట్ రేట్లు విషయంలో) ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు. అది మనందరికీ తెలుసు. రేపే (డిసెంబర్ 24) సినిమా రిలీజ్ కాబట్టి, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. సినిమాలు, రాజకీయాలను పక్కనపెడితే.. మీరు ప్రేక్షకులను అవమానపరుస్తున్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది."