తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్​సింగరాయ్' టీజర్.. కృతిశెట్టి 'నాగలక్ష్మి' ఫస్ట్​లుక్ - bangarraju release date

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్యామ్​సింగరాయ్, బంగార్రాజు, నిఖిల్-సుధీర్ వర్మ కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్

By

Published : Nov 18, 2021, 10:31 AM IST

Updated : Nov 18, 2021, 1:19 PM IST

*నాని 'శ్యామ్​సింగరాయ్' టీజర్ వచ్చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ టీజర్.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇందులోని నాని రెట్రో లుక్​ ఫ్యాన్స్​ పండగ చేసుకునేలా ఉంది! 'స్త్రీ ఎవడికీ దాసి కాదు. ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబడ్దార్' అంటూ బెంగాలీలో నాని చెప్పిన డైలాగ్.. ఆకట్టుకుంటోంది.

కోల్​కతా బ్యాక్​డ్రాప్​లో తీస్తున్న ఈ సినిమాలో నాని.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించగా, రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈనెల 24న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

*కింగ్ నాగార్జున 'బంగార్రాజు' నుంచి నాగలక్ష్మి ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఈ పాత్రలో నటిస్తున్న కృతిశెట్టి.. తన అందంతో అలరిస్తోంది. ఈమెకు జోడీగా నాగచైతన్య బంగార్రాజుగా కనిపించనున్నారు. త్వరలో తన ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు.

.

2016 సంక్రాంతికి వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన'కు ఇది ప్రీక్వెల్​గా తెరకెక్కుతోంది. తొలి భాగంలో నటించిన నాగార్జున, రమ్యకృష్ణ.. ఇందులోనూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్​కృష్ణ కురసాల దర్శకుడు. అన్నపూర్ణ బ్యానర్​ పిక్చర్స్​ పతాకంపై నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు.

*'స్వామిరారా', 'కేశవ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్న అలరించిన కాంబినేషన్ హీరో నిఖిల్- డైరెక్టర్ సుధీర్​వర్మ. వీరి కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్​లో జరుగుతోంది.

.
.

ఈ క్రమంలోనే లండన్​లోని లార్డ్ కార్తికేయ స్వామి మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రుక్మిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 18, 2021, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details