తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాతీయ ఉత్తమ నటుడి సినిమాపై అరబ్ దేశాల్లో నిషేధం - cinema news

బాలీవుడ్ సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'పై అరబ్ దేశాల్లో నిషేధం విధించారు. ఇందులోని కథ వల్లే ఇలా చేశారు. జాతీయ ఉత్తమ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

కథ వల్లే ఆ సినిమాపై అరబ్ దేశాల్లో నిషేధం
'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' సినిమా

By

Published : Feb 21, 2020, 8:37 PM IST

Updated : Mar 2, 2020, 2:49 AM IST

బాలీవుడ్​లో విభిన్న కథలు చేసేవారిలో హీరో ఆయుష్మాన్ ఖురానా ముందుంటాడు. 'అంధాదున్', 'ఆర్టికల్ 15', 'డ్రీమ్​గర్ల్' వంటి సినిమాలతో గతేడాది ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు 'శుభ్ ​మంగళ్ జ్యాదా సావధాన్​'తో థియేటర్లలోకి వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా నేడు(శుక్రవారం) విడుదలైన ఈ చిత్రాన్ని దుబాయ్, యునైటెడ్​ అరబ్ ఎమిరేట్స్​​లో మాత్రం నిషేధించారు.

'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' సినిమాలోని సన్నివేశాలు

ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటే ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ. అయితే ఈ సినిమాకు అరబ్ ప్రభుత్వం అడ్డు చెప్పింది. నిర్మాతలు కొన్ని సన్నివేశాలను కత్తిరిస్తామని చెప్పినా హోమో సెక్సువల్ కథ కాబట్టి బ్యాన్ చేశారు.

ఇందులో ప్రధాన పాత్రలైన కార్తిక్, అమన్​ల మధ్య వచ్చే సన్నివేశాలు, 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' తరహా ట్రైన్ ఎపిసోడ్, అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుని తాను ప్రేమించిన కార్తిక్‌ కోసం అమన్ పరిగెత్తుకుంటూ రావడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి.

Last Updated : Mar 2, 2020, 2:49 AM IST

ABOUT THE AUTHOR

...view details