'కొంచెం నిరూత్సాహం ఆవరిస్తే చాలు వెంటనే శ్రుతి హాసన్‌ను(Shruthi Hassan) ఫోన్ చేసి మాట్లాడతాను, తనే నాకు స్ఫూర్తి' అని తమన్నా భాటియా(Tamannah) చెప్పింది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ ఉన్నప్పుడల్లా ఒకరింటికి ఒకరు వెళ్తుంటారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో వీరిద్దరూ తామిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఇప్పుడు మరోసారి శ్రుతి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చిందీ మిల్కీబ్యూటీ.
"ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే శ్రుతి హాసన్‌కg ఫోన్ చేసి, తను అంత ఉత్సాహంగా ఎలా ఉంటుందో అడుగుతాను. శ్రుతి తన ఇంటిని తనే చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. ఒక్కతే అలా చేయడం మామూలు విషయం కాదు. పైగా కెరీర్ పరంగా ఎంతగానో కష్టపడుతుంది. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో సరదాగా మాట్లాడుతుంది. ఇలా ఎప్పుడూ హుషారుగా ఉండటం చాలా కష్టం. ఈ విషయంలో శ్రుతి నాకు స్ఫూర్తి" అని తెలిపింది తమన్నా.