Shruthi hassan salaar movie: ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా 'సలార్' టీమ్ ఆమెకు విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రుతి.. ఆద్య పాత్రలో ప్రభాస్ సరసన హీరోయిన్గా చేస్తోంది.
ఈ సినిమాకు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇందులో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తుండగా, రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది 'సలార్', ప్రేక్షకుల ముందుకు రానుంది.