'మొక్కలు నాటండి... మీరూ నాటండి అని మరికొంత మందికి చెప్పండి' అంటూ మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. నాయకా నాయికలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మొక్కలు నాటి.. స్నేహితులకు నామినేట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా కథానాయిక శ్రుతి హాసన్ కూడా మొక్కలు నాటారు. కథానాయకుడు మహేశ్‌బాబు, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ శ్రుతిని నామినేట్ చేయడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - బాలీవుడ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హరితహారంలో పాల్గొన్న నటి శ్రుతిహాసన్.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, రానా, తమన్నాలకు ఈ సవాలు విసిరింది.
నటి శ్రుతిహాసన్
మొక్కలు నాటుతున్న ఫొటోను శ్రుతి హాసన్ ట్వీట్ చేస్తూ... ఈ హరితహారంలో మీరూ పాలుపంచుకోండి అంటూ బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్, నటుడు రానా, నటి తమన్నాను నామినేట్ చేసింది. దీంతో ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు బాలీవుడ్‌కి కూడా వెళ్లింది. మరి అక్కడ హృతిక్ మొక్కలు నాటి ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి.