'క్రాక్'తో సంక్రాంతికి హిట్ కొట్టి.. ప్రభాస్ 'సలార్' షూటింగ్‌తో బిజీగా ఉన్న శ్రుతి హాసన్.. మరోసారి వార్తల్లో నిలిచింది. తన రూమర్ బాయ్‌ఫ్రెండ్ శంతను హజరికాను హగ్ చేసుకుని ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడమే దీనికి కారణం. ఇందులో ఈ జంట మ్యాచింగ్ మాస్క్ కూడా పెట్టుకుని ఉన్నారు.
రూమర్ బాయ్‌ఫ్రెండ్‌తో మ్యాచింగ్ మాస్క్‌లో శ్రుతి! - మూవీ న్యూస్
కథానాయిక శ్రుతిహాసన్, తన రూమర్ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి చెన్నైలో సందడి చేసింది. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.
శ్రుతిహాసన్
శంతను, దిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. శ్రుతి హాసన్ పుట్టినరోజున ఆమె ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఇతడు.. 'హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్' అని రాసుకొచ్చాడు. అప్పటినుంచి వీరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. తాము కేవలం స్నేహితులమే అని చెప్పిన శంతను.. తమ బంధం గురించి బయటకు చెప్పాలనుకోవట్లేదని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆర్ట్, మ్యూజిక్, కల్చర్ అంశాల్లో తామిద్దరి అభిరుచులు కలిశాయని అన్నాడు.
ఇవీ చదవండి: