స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఇటీవల నటించిన 'క్రాక్' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని నమోదు చేయడం సహా ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించనున్న 'సలార్' చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం చిత్రబృందం శ్రుతిని సంప్రదించినట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సిఉంది.
ప్రభాస్‌కు హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తుందా? - సలార్ చిత్రంలో శ్రుతిహాసన్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం 'సలార్'లో శ్రుతిహాసన్ ఎంపికైందని సమాచారం. బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉన్న భామను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌కు హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తుందా?
'సలార్' చిత్రంలో ప్రభాస్ సరసన నటించేందుకు ఇప్పటికే బాలీవుడ్ భామలు సారా అలీఖాన్, దిశాపటానీలనూ చిత్రబృందం ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ కిరాగుండూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి:సింగరేణిలో ప్రభాస్ 'సలార్' షూటింగ్!