హీరోయిన్ శ్రుతిహాసన్.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చివరగా 'కాటమరాయుడు'లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... రవితేజ కొత్త చిత్రం 'క్రాక్'లో అవకాశం దక్కించుకుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
"టాలీవుడ్లో తిరిగి నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళ అమ్మాయిని అయినా, తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం. హీరోయిన్గా నా సినీ ప్రయాణం తెలుగులోనే మొదలైంది. టాలీవుడ్ నాకు రెండో ఇళ్లులాంటిది"
-శ్రుతిహాసన్, హీరోయిన్