'నాలో నాకు నచ్చేది నా నిజాయితీనే, నన్ను సంతోషంగా ఉంచే విషయమూ అదే' అని శ్రుతిహాసన్ అంటోంది. హీరోయిన్గా ఎంతో అనుభవం గడించిన ఈమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ప్రభావం చూపిస్తోంది. ప్రభాస్‌తో కలిసి ప్రస్తుతం 'సలార్'లో నటిస్తోంది. నిజాయతీగా ఆలోచించడంతోనే నేను ప్రతీరోజూ ఓ అందమైన పాఠం నేర్చుకుంటానని చెబుతోంది.
నాలో నాకు నచ్చేది అదే: శ్రుతిహాసన్ - shruti haasan latest news
తప్పు జరిగినప్పుడు ముందుగా ఆత్మ విమర్శ చేసుకుంటానని హీరోయిన్ శ్రుతిహాసన్ చెబుతోంది. తనలో తనకు నచ్చేది నిజాయతీనే అని వెల్లడించింది.
![నాలో నాకు నచ్చేది అదే: శ్రుతిహాసన్ shruti haasan about her frankness](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13449014-thumbnail-3x2-shruthi.jpg)
శ్రుతిహాసన్
"జీవితంలో ఆటుపోట్లు ఎదురవగానే కంగారు పడిపోయే రకం కాదు నేను. ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తా. తప్పు అనగానే మొదట ఎదుటివాళ్లవైపు చూస్తుంటాం. నేను మాత్రం నా నుంచే మొదలు పెడతా. అలా ఆత్మ విమర్శ చేసుకున్నాకే, మిగతా విషయాల గురించి ఆలోచిస్తుంటా" అని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది.
ఇవీ చదవండి:
Last Updated : Oct 25, 2021, 11:45 AM IST