మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'క్రాక్' షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాతో చాలారోజుల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకుంది.
టాలీవుడ్లో సెక్సీ నటి తమన్నా అని చెప్పిన శ్రుతి.. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని స్పష్టం చేసింది. డార్లింగ్ ప్రభాస్తో నటించాలని ఆశగా ఉన్నట్లు చెప్పింది.