తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రియను భయపెట్టిన పోలీసులు.. షాక్​లో ముద్దుగుమ్మ - శ్రియ శరణ్

లండన్​కు సినిమా షూటింగ్​ కోసం వెళ్లిన హీరోయిన్ శ్రియ.. నిషేధిత ప్రదేశానికి వెళ్లిందట. ఆ తర్వాత ఆమెపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారట. దీంతో షాక్​లోకి వెళ్లిన ఈ భామ తేరుకోవడానికి కాస్త సమయం పట్టిందట.

HEROINE shriya saran
హీరోయిన్ శ్రియ శరణ్

By

Published : Dec 12, 2019, 5:31 AM IST

దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయిక​గా గుర్తింపు పొందిన భామ శ్రియ. నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో పాటు ప్రత్యేక గీతాలు, గ్లామర్‌ పాత్రలు.. ఇలా అన్నీ చేసుకుంటూ పోతోంది. తాజాగా ఓ తమిళ సినిమా చిత్రీకరణ కోసం లండన్‌ వెళ్లింది. అక్కడ ఓ ప్రఖ్యాత ఎయిర్‌పోర్ట్‌లో షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో శ్రియ.. పర్యటకులకు అనుమతి లేని నిషేధిత ప్రాంతంలోకి తెలియకుండా వెళ్లిందట.

అప్పుడు ఆమెను గమనించిన పోలీసులు తుపాకీ చూపెట్టి అదుపులోకి తీసుకున్నారట. అనంతరం ప్రశ్నల వర్షం కురిపించారట. ఆమె పరిస్థితి తెలుసుకున్న చిత్ర బృందం.. వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించింది. తర్వాత పోలీసులు ఆమెను విడిచి పెట్టినట్టు సమాచారం. ఆ షాక్‌ నుంచి కోలుకోవటానికి శ్రియకు చాలా సమయమే పట్టిందట. కొంత విరామం తరువాత మళ్లీ చిత్రీకరణలో పాల్గొందట.

ABOUT THE AUTHOR

...view details