ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్.. శనివారం మధ్యాహ్నం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్స్టా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సెలబ్రిటీలు శ్రేయకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ - మూవీ న్యూస్
పలు భాషల్లో ఎన్నో వందల పాటలు పాడిన శ్రేయా ఘోషల్.. శనివారం మగపిల్లాడికి జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

శ్రేయా ఘోషల్
2015 ఫిబ్రవరి 5న శైలాదిత్య ముఖోపాధ్యాయను శ్రేయా ఘోషల్ వివాహం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇది చదవండి:మధుర క్షణాల్ని అనుభవిస్తున్నా: శ్రేయా ఘోషల్