'సాహో'తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్.. విభిన్న పాత్రలు, వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే ఈ భామకు మొదటి సినిమా ఆఫర్ సల్మాన్ నుంచే వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని వదులుకుంది. చిన్నప్పటి నుంచి పాటలు, డ్యాన్స్‌ల్లో ఈ హీరోయిన్ దిట్ట. సంప్రదాయ సంగీతంలోనూ ప్రవేశముంది. నటన అంటే ఇష్టమున్నా ఇంట్లో ఏమంటారో అని బయటకు చెప్పేది కాదు.
సల్మాన్‌కు నో చెప్పిన శ్రద్ధా కపూర్ - shradha kapoor says no to salman khan
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు మొదటి చిత్రంలోనే సల్మాన్ ఖాన్ పక్కన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సదవకాశాన్ని వదులుకుందట ఈ హీరోయిన్.
![సల్మాన్‌కు నో చెప్పిన శ్రద్ధా కపూర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4781220-thumbnail-3x2-salman.jpg)
పదహారేళ్ల వయసులో ఓసారి స్కూల్ ఫంక్షన్లో నాటకం వేస్తుండగా సల్మాన్ చూసి నా పక్కన నటిస్తావా అని అడిగాడు. చదువు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ అవకాశాన్ని వద్దనుకుంది. తర్వాత సైకాలజీ చదవడానికి అమెరికా వెళ్లి మధ్యలోనే వదిలేసి వచ్చి.. 'తీన్‌పత్తి' సినిమాతో తెరంగేట్రం చేసింది. కారణమేదైనా చదువు మధ్యలో వదిలేయద్దంటోంది శ్రద్ధా. కాలేజీ రోజులు వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి, ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటాయని చెప్పింది.
ఇవీ చూడండి.. తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్