బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ వాట్సాప్ చాట్ వైరల్‌గా మారింది. ఇటీవలే ముంబయి స్టూడియో నుంచి శ్రద్ధా బయటికి వస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ తన ఫొటో తీశాడు. ఆ సమయంలో శ్రద్ధా ఫోన్లో బిజీగా ఉంది. అయితే.. తన వాట్సాప్ చాట్ కూడా కనిపించేలా ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఫొటోగ్రాఫర్.
"ముంబయిలో షూటింగ్ ముగించుకుని బయటకు వచ్చాక శ్రద్ధా.. ఫోన్లో చూస్తూ చాలా బిజీగా కనిపించింది. లవ్ ఎమోజీ కాంటాక్ట్‌తో చాట్ చేసింది. మరి అతనెవరో తెలియాల్సి ఉంది" అని ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.
అయితే.. ఆ వాట్సాప్ చాట్ నిజమేనా?. లేక ఫొటోషాప్ చేసిందా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని.. ఈ విధంగా చేయడం సరికాదని మరికొందరు కామెంట్లు చేశారు. "మీపైన ఉన్న నమ్మకంతోనే వారు మిమ్మల్ని దగ్గరకు రానిస్తారు. మీరు ఇలా చేయడం సరికాదు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సినిమాల విషయానికొస్తే.. రణ్‌బీర్ కపూర్, లవ్ రంజన్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రద్ధా నటించనుంది. విశాల్ ఫురియా చిత్రంలోను ఆమె నాగినిగా కనిపించనుంది.
ఇదీ చదవండి:'శ్రద్ధా.. అతడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు'