బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. తన తర్వాతి సినిమాలో నాగినిగా కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. దిగ్గజ శ్రీదేవి 'నాగిన' చూసి, అలాంటి పాత్ర చేయాలని అనుకునే దానిని అని, త్వరలో ఆ కోరిక నెరవేరనుందని తెలిపింది. ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకుడు. నిఖిల్ ద్వివేది నిర్మాత. మూడు భాషాల్లో దీనిని విడుదల చేయనున్నారు.
శ్రద్ధా కంటే ముందు..
హీరోయిన్ శ్రద్ధా కపూర్ కంటే ముందు శ్రీదేవి, రేఖ, రీనా రాయ్ లాంటి హీరోయిన్లు నాగిని వేషధారణలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు.
దీనితోపాటు దర్శకుడు లవ్ రంజన్ తీస్తున్న సినిమాలో షాహిద్, రణ్‌బీర్‌లతో కలిసి నటించనుంది శ్రద్ధా. వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. గతేడాది భాఘీ 3, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిందీ భామ.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రద్ధా కపూర్.. సమన్లు జారీ చేయడం వల్ల మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు విచారణకు హాజైరంది. ఈమెతో పాటే సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణెలను అధికారులు ప్రశ్నించారు.