బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన హారర్ కామెడీ చిత్రం 'స్త్రీ'. రాజ్‌కుమార్ రావ్ హీరో. దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన మూవీకి తెలుగువారైన రాజ్-డి.కె కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. తాజాగా ఈ సినిమా జపాన్‌లో విడుదలవబోతుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా శ్రద్ధ వెల్లడించింది.
జపాన్‌లో సందడి చేయనున్న శ్రద్ధా కపూర్ 'స్త్రీ'
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ కలిసి నటించిన హారర్ కామెడీ చిత్రం 'స్త్రీ'. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది శ్రద్ధ.
జపాన్‌లో సందడి చేయనున్న హారర్ చిత్రం 'స్త్రీ'
దెయ్యాల గురించి పుకార్లు రావడం కొత్తేమీ కాదు. 1990వ దశకంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ ఆడ దెయ్యం సంచరిస్తోందన్న పుకార్లకు భయపడి 'ఓ స్త్రీ రేపురా' అని ఇళ్ల గోడలపై రాసుకున్న ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.