తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రద్ధా కుక్కపిల్ల పేరుకీ ఓ లెక్కుంది! - shailo

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్​కు కుటుంబంలో పేర్లకు ఓ సెంటిమెంట్ ఉందట. ఆఖరుకి తాను పెంచుకుంటున్న కుక్క పేరు కోసం కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అయ్యారట.

శ్రద్ధ

By

Published : Jun 12, 2019, 7:05 AM IST

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కుక్కపిల్ల... కాదేదీ అనర్హం అన్నట్లు... సినిమా పేర్ల నుంచి పెంపుడు కుక్కపిల్ల పేర్ల వరకూ అన్నిటికీ అచ్చొచ్చిన సెంటిమెంట్లు ఫాలో అయిపోతుంటారు. ఈ విషయంలో బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ మినహాయింపు కాదు. ఆమె ఇంట్లో అందరి పేర్లు 'ఎస్‌'తోనే మొదలవుతాయి. ఆమె తండ్రి ఒకప్పటి ప్రముఖ నటుడు శక్తి కపూర్‌. ప్రతినాయక పాత్రలు, హాస్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లి పేరు శివాంగి కపూర్‌. ఆమె సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌. ఇలా 'ఎస్‌'తో మొదలయ్యే పేర్లంటే శ్రద్ధకు ఇష్టం. అందుకే తను ముద్దుగా పెంచుకునే కుక్కపిల్లకు కూడా అలాంటి పేరే ఏరికోరి పెట్టింది. ఇంతకీ ఆ పేరేంటో తెలుసా.. షైలో. అలా శ్రద్ధ కుటుంబం మొత్తం 'ఎస్‌'తోనే నిండిపోయిందన్నమాట.

కుక్కపిల్లతో శ్రద్ధ

ABOUT THE AUTHOR

...view details