బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సామాజిక మాధ్యమంలో తన ఫాలోవర్స్ 50 మిలియన్లకు (5కోట్లు) చేరుకున్న కారణంగా ఇంగ్లీష్, హిందీ, మరాఠీలో ఫ్యాన్స్‌కు ఓ సందేశం పోస్ట్ చేసింది. తరచూ తన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంటుందీ భామ. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ అలరిస్తోంది.
"నా ప్రియమైన, దగ్గరైన, బుడ్డీస్, ఫ్యాన్ క్లబ్స్, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. నా ఫొటోలు, వీడియోలు, ఎడిట్స్‌ను నా మీద ప్రేమతో పోస్ట్ చేస్తున్న వారి పట్ల ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి, దయ, శాంతిని అందరికీ పంచండి."