తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో 'సాహో' హీరోయిన్​​కు గాయాలు - శ్రద్ధాకపూర్

'స్ట్రీట్ డ్యాన్సర్​ త్రీడీ' షూటింగ్​లో హీరోయిన్​ శ్రద్ధా కపూర్ గాయపడింది. సంబంధిత వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

శ్రద్ధాకపూర్

By

Published : Jul 24, 2019, 4:08 PM IST

సాహో హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం 'స్ట్రీట్​ డ్యాన్సర్ త్రీడీ'లో నటిస్తోంది. సినిమా చిత్రీకరణలో భాగంగా డ్యాన్స్ చేస్తుండగా గాయపడిందీ కథానాయిక. ఆ వీడియోను తన ఇన్​స్టాలో పంచుకుంది. మెడ, చీలమండకు గాయమైందని తెలిపింది. ఫిజియోథెరఫిస్ట్ వల్ల గాయాల నుంచి కోలుకున్నానని చెపుతూ అతడికి ధన్యవాదాలు తెలిపింది.

స్ట్రీట్​ డ్యాన్సర్ త్రీడీ

ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. డ్యాన్స్ నేపథ్య కథతో తెరకెక్కిస్తున్నారు. ప్రభుదేవా, నోరా ఫతేహి, అపర్​శక్తి కర్ణా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నాడు.

శ్రద్ధా కపూర్​ నటించిన మరో సినిమా 'సాహో' విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది సంగతి: బాలీవుడ్​ ఓ మై బేబీగా శ్రద్ధాకపూర్​..!

ABOUT THE AUTHOR

...view details