జూన్ 8 నుంచి కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల షాపింగ్ మాల్స్ తెరవడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం అనుమతినిచ్చింది. అయితే అందులో ఉండే సినిమా హాళ్లు, గేమింగ్ సెంటర్లు, పిల్లల ఆట ప్రదేశాలు మూసే ఉంటాయని వెల్లడించింది.
లాక్డౌన్ సడలింపులు ఇస్తోన్న క్రమంలో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరవడానికి అనుమతించిన కేంద్రం.. సినిమా కార్యకలాపాలకు ఎప్పటి నుంచి అనుమతిస్తారో తాజా ప్రకటనలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరికొన్ని తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవలె తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిచ్చింది. ఫలితంగా చిత్రీకరణలు జూన్ రెండో వారం తర్వాత నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.