తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' పేరుతో తీస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయ పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఆదివారం నుంచి చెన్నైలో ప్రారంభమైంది. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో చిత్రబృందం పంచుకుంది.
జయలలిత బయోపిక్ 'తలైవి' షూటింగ్ ప్రారంభం - kangana latest cinema
హీరోయిన్ కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించనున్న 'తలైవి' షూటింగ్ ఆదివారం మొదలైంది. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
జయలలిత బయోపిక్ 'తలైవి'
ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'బ్లేడ్ రన్నర్', 'కెప్టెన్ మార్వెల్' లాంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్.. కంగనా రనౌత్‌ను జయలలితగా చూపించనున్నారు.
ఇది చదవండి: తొలిసారి స్క్రీన్‌పై వేరొకరి పాత్ర పోషిస్తున్నా: కంగనా రనౌత్