మెగాస్టార్ చిరంజీవి ఈరోజు 66వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కాగా చిరు తనయ సుస్మితా కొణిదెల ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇటీవలే తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సుస్మిత వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
చిరు బర్త్‌డే: మెగా డాటర్ సర్ప్రైజ్ - చిరంజీవి పుట్టినరోజు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయ సుస్మితా కొణిదెల ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్‌ను చిరు బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
షూటవుట్ ఎట్ ఆలేరు' పోస్టర్
'షూటవుట్ ఎట్ ఆలేరు' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కథను చెప్పేశారు. దీంతో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది.