ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రభావం హాలీవుడ్‌పైనా పడింది. 'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్రబృందం ఇటలీలో మూడు వారాల షెడ్యూల్‌ని ప్లాన్ చేసింది. అయితే ఆ దేశంలో కరోనా (కొవిడ్-19) వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండటం వల్ల చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది.
'మిషన్ ఇంపాజిబుల్'కు కరోనా ఎఫెక్ట్ - కరోనా ఎఫెక్ట్
హాలీవుడ్ యాక్షన్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్ 7' సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇటలీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూడు వారాల పాటు చిత్రీకరణను రద్దు చేసింది చిత్రబృందం.

మిషన్ ఇంపాజిబుల్కు కరోనా ఎఫెక్ట్
'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ నుంచి ఇప్పటివరకు ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం సెట్స్‌పై ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్ క్రూజ్ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 23న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి..'అరణ్య' కోసం రెండేళ్ల అజ్ఞాతవాసంలో రానా
Last Updated : Mar 2, 2020, 3:08 PM IST