అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కరోనా వైరస్ ముందే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 7న షూటింగ్ పునః ప్రారంభించారు. తాజాగా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సాయిపల్లవి, శేఖర్ మాస్టర్ కలిసి తీసుకున్న చిత్రాన్ని పోస్టు చేసింది.
చై-సాయి పల్లవి 'లవ్‌స్టోరీ' ముగిసింది.. - by Narayan Das K Narang
అక్కినేని వారసుడు నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్‌స్టోరీ'. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
చై-సాయి పల్లవి లవ్‌స్టోరీకి శుభంకార్డు..?
ఈ ఏడాది చివర్లోపు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.