లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో నటి అదాశర్మ.. తిరిగి షూటింగ్ పాల్గొంది. ఆ అనుభవాన్ని పంచుకుంది. చిత్రీకరణకు వెళ్తుంటే యుద్ధానికి పోతున్నట్లుగా ఉందనని వెల్లడించింది. ఇటీవలే ఓ కాఫీ కంపెనీ యాడ్లో నటించినట్లు పేర్కొంది. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
"లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ సెట్లో తొలిసారి అడుగుపెట్టాను. ఓ కాఫీ కంపెనీ యాడ్ చిత్రీకరణలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పాల్గొన్నా. సెట్లో 20 మందికి కంటే తక్కువుగా ఉండేలా చూసుకుని.. అంతటా శానిటైజ్ చేశాం. మాస్కులు ధరించాం. ఇదంతా చూస్తుంటే ఓ సమరానికి వెళ్తున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మనమంతా కరోనాతో పోరాడాలి కదా"