తెలంగాణ

telangana

ETV Bharat / sitara

‘సర్దార్​ ఉద్దమ్‌ సింగ్‌’  విడుదలయ్యేది వచ్చే ఏడాదే.. - Shoojit Sircar

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడి జీవితం ఆధారంగా 'సర్దార్​ ఉద్దమ్​ ​సింగ్' చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్​ నటుడు విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. సుజీత్​ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్​ 2న విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది.

2020 అక్టోబర్​లో ప్రేక్షకుల ముందుకు ‘సర్ధార్‌ ఉద్దమ్‌ సింగ్‌’

By

Published : Jun 18, 2019, 5:54 AM IST

Updated : Jun 18, 2019, 8:52 AM IST

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘'సర్దార్​ ఉద్దమ్‌ సింగ్‌' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2020 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది.

భారత విప్లవ వీరుడు సర్దార్​ ఉద్దమ్‌ సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రైజింగ్‌ సన్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. ఉద్దమ్‌ సింగ్‌ జీవితంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రోన్ని లహిరి, షీల్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు.

ఇదీ కథ.!

బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా 1919వ సంవత్సరం పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో భారతీయులు శాంతియుతంగా సమావేశమయ్యారు. నాటి పంజాబ్‌ గవర్నర్‌ మైఖేల్‌ ఓ డయ్యర్‌ ఆదేశాలతో అక్కడ సమావేశమైన వారిపై బ్రిటీష్​ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా డయ్యర్‌ను 1940 మార్చి 13న లండన్​లో ఉద్దమ్​ సింగ్ కాల్చి చంపాడు. ఉద్దమ్‌సింగ్‌ని అరెస్ట్‌ చేసి1940జులై 31న ఉరితీశారు.

ఇదే కథాంశంతో 1999లో ‘'షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌'’ అనే సినిమా వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రధారిగా రాజ్‌ బబ్బర్‌ నటించగా, గురుదాస్‌ మన్‌... భగత్‌ సింగ్‌గా, మహ్మద్‌ ఖాన్‌ పాత్రలో శత్రుఘ్న సిన్హా నటించారు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్​తో కొరటాల చిత్రం ఎప్పుడు..?

Last Updated : Jun 18, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details