తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ అయినట్లు, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుజీత్ సర్కార్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎకౌంట్ నిషేధిత ఫ్రొపైల్గా చూపిస్తోంది. దీనిని చూడాలంటే 99 ఏళ్లు లేదా అంతకు పైబడిన వ్యక్తులే ఉండాలని సూచిస్తోంది.
బాలీవుడ్ దర్శకుడి ఇన్‌స్టా ఖాతా హ్యాక్ - bollywood latest news
బాలీవుడ్ దర్శకుడు సుజీత్ సర్కార్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రముఖ దర్శకుడు ఇన్‌స్టా ఖాతా హ్యాక్
సుజీత్ దర్శకత్వం వహించిన 'గులాబో సితాబో'.. జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాటయోధుడు 'సర్దార్ ఉద్ధమ్ సింగ్' జీవిత కథతో సినిమా తీస్తున్నారు. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
ఇదీ చూడండి: