తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోషల్ మీడియాకు దర్శకుడు సూజిత్ దూరం! - సర్దార్ ఉద్దమ్ సింగ్ సూజిత్ సర్కార్

కొత్త సినిమాను త్వరగా పూర్తిచేసేందుకుగాను, కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు దర్శకుడు సూజిత్ సర్కార్. ఈ మేరకు అభిమానులను ఇన్​స్టాలో, ఇదే విషయమై ప్రశ్నించారు.

సోషల్ మీడియాకు దర్శకుడు సూజిత్ దూరం!
దర్శకుడు సూజిత్ సర్కార్

By

Published : Jul 7, 2020, 1:59 PM IST

సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక బాలీవుడ్​కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, దానికి వీడ్కోలు పలకడం లేదా తాత్కాలిక విరామం తీసుకుంటున్నారు. ఇదే తరహాలో దర్శకుడు సూజిత్ సర్కార్.. సామాజిక మాధ్యమాలకు కొద్దిరోజులు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. కొత్త సినిమాను త్వరగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

సూజిత్.. ప్రస్తుతం 'సర్దార్ ఉద్దమ్ సింగ్' బయోపిక్​ను తెరకెక్కిస్తున్నారు. నటుడు విక్కీ కౌశల్ టైటిల్​ రోల్ పోషిస్తున్నారు. 1919 జలియన్ వాలాబాగ్​ ఉదంతం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. చాలావరకు షూటింగ్​ జరుపుకొన్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చే ఏడాది రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details