దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఇందులో శోభన్ బాబు పాత్ర గురించే చర్చ నడుస్తోంది. గతంలో జయలలిత - శోభన్ బాబు ప్రేమించుకున్నారనే వార్తలే వీటికి కారణం.
అప్పట్లో ఈ అందాల నటుడితో జయ ప్రేమలో ఉన్నట్లు.. ఒకానొక దశలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు రకరకాల వార్తలొచ్చాయి. కాబట్టి ఇప్పుడీ జీవిత కథలో శోభన్‌బాబు పాత్రను చూపిస్తారా? లేదా? అన్నది కీలకంగా మారింది. ఒకవేళ వీరి ప్రేమ కథ గురించి ఇందులో చూపిస్తే జయ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఈ హీరో పాత్ర తీసేస్తే కథలో వాస్తవికత దెబ్బతింటుంది.