తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శోభన్​బాబు అందుకే నటనకు స్వస్తి చెప్పారు! - శోభన్​ బాబు గురించి కృష్ణంరాజు

వెండితెర అందాల నటుడు శోభన్​బాబు.. తాను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటం వెనుక గల రహస్యాన్ని చెప్పారు. తానెప్పుడూ ఆస్తులు కన్నా మేధాసంపత్తికే ప్రాధాన్యమిస్తానని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆ ఆసక్తికర విషయాలు మీకోసం.

sobhan
శోభన్​

By

Published : Jan 14, 2021, 5:31 AM IST

వెండితెర సోగ్గాడిగా అభిమానుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయిన కథానాయకుడు శోభన్‌బాబు. క్రమశిక్షణ కలిగిన జీవితానికి ఆయన ప్రతీక. ఎన్నో గుప్తదానాలు చేసిన మంచి మనసు ఆయనది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే ఆయన తన జీవితకాలంలో ఆసుపత్రికి వెళ్లడం కానీ, ఇంజక్షన్ కానీ తీసుకోలేదు. ఇంత ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలని గతంలో ఓసారి ఆయనే స్వయంగా చెప్పారు. గురువారం ఆయన జయంతి సందర్భంగా ఆ విశేషాలు మరోసారి మీకోసం.

"నేను ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఏం తీసుకోను. మితంగా ఆహారం తింటాను. టీ, కాఫీ అలానే తాగుతాను. సిగరెట్​, మద్యపానం ఎప్పుడూ ముట్టుకోను. (సినిమా కోసం తప్ప). ఈ అలవాటును చూసి చాలా మంది నవ్వుకున్నారు. కానీ నేను మాత్రం నా అలవాట్లను మార్చుకోలేదు"

-శోభన్​బాబు, సీనియర్ హీరో

మేధా సంపత్తికే ప్రాధాన్యత

జీవితంలో వ్యక్తిగత ఆస్తుల కన్నా మేధా సంపత్తికే తన తొలి ప్రాధాన్యం ఇచ్చానని శోభన్​బాబు గతంలో సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మేధా సంపత్తి లేకపోతే ఎంత ఉన్నా అదంతా వృథా అవుతుందని చెప్పారు. తన స్నేహితుల్లో చాలా మంది బీదవాళ్లని, ఐశ్వర్యం ఉన్న స్నేహితులు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరని తెలిపారు. ఎందుకు తాను మేధా సంపత్తికే ప్రాధాన్యత ఇస్తారో కూడా వివరించారు. ఆ మాటలు వినాలంటే ఈ కింది వీడియోను చూసేయండి.

అందుకే శోభన్​ నటనకు స్వస్తి చెప్పారు!

క్రమశిక్షణ కలిగిన జీవితానికి ప్రతీకగా నిలిచిన శోభన్ బాబు.. 60వ ఏడాదిలోకి ప్రవేశించగానే స్వచ్ఛందంగా నటజీవితానికి స్వస్తిచెప్పి అభిమానుల హృదయాల్లో హీరో ఇమేజితోనే తెరమరుగయ్యారు. తాను నటించిన 200 పైచిలుకు చిత్రాల్లో శోభన్ బాబును సోగ్గాడుగానే చూపించాయి. వార్ధక్య ఛాయలతో క్యారక్టర్ పాత్రలు చేసేందుకు ఆయన మనసు అంగీకరించలేదట. అందుకే నటనకు స్వస్తి చెప్పిన తర్వాత తన ఫోటో కూడా బయటకు రాకుండా చూశారు. మనిషైతే మనముందు లేరుగానీ, అభిమానుల మనసుల్లో ఆయన అందాల రూపం ఎప్పడూ కదలాడుతూనే ఉంటోంది.

ఉచితంగా సినిమా చేస్తానన్నారు!

"పరుచూరి బ్రదర్స్‌గా మా సోదరులు ఇద్దరం శోభన్‌బాబుతో 13 సినిమాలకు పనిచేశాం. అవతలివారి మంచిని కోరే మనిషి శోభన్‌బాబు. మా దర్శకత్వంలో రూపొందిన 'సర్పయాగం'లో ఆయన కథానాయకుడు. మాకెన్నో మంచి విషయాలు చెప్పారాయన. నమ్మిన మనుషులెవరికైనా మంచి సలహాలు చెప్పేవారు. ఆయన సలహాలను ఆచరిస్తే జీవితంలో ఎదుగుతాం. పారితోషికం తీసుకోకుండా ఉచితంగా సినిమా చేస్తానని శోభన్‌బాబు మాటిచ్చారు. ఇది ఆయన మంచితనానికికో ఉదాహరణ. కానీ ఆ మంచితనాన్ని క్యాష్‌ చేసుకోవడం ఇష్టం లేక ఆయనతో సినిమా చేయలేదు"

-పరుచూరి గోపాలకృష్ణ, రచయిత.

శోభన్​ సలహాతో కోటీశ్వరులుగా!

"మనిషే కాకుండా, శోభన్​బాబు మనసు కూడా అందమైనదే. ఆయన సలహాలతో కోటీశ్వరులైన వాళ్లు ఎంతోమంది. శోభన్‌బాబు మరణించి ఇన్నేళ్లయినా ఆయన్ని గుర్తుపెట్టుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు అభిమానులు"

-కృష్ణంరాజు, ప్రముఖ నటుడు

ఇద చూడండి: జయలలితను శోభన్​బాబు అందుకే దూరంపెట్టారు!

ABOUT THE AUTHOR

...view details