తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రకాశ్‌రాజ్‌ కుమార్తెగా 'దొరసాని'..? - ranga marthanda

ప్రకాశ్​రాజ్, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'రంగమార్తాండ'. ఈ సినిమాలో జీవితారాజశేఖర్ కూతురు శివాత్మక కూడా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి.

shivathmika
ప్రకాశ్ రాజ్

By

Published : Dec 14, 2019, 6:09 AM IST

ప్రకాశ్‌రాజ్‌ కుమార్తెగా దొరసాని కనిపిస్తుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ దొరసాని ఎవరు అనుకుంటున్నారా.. జీవితారాజశేఖర్‌ ముద్దుల తనయ శివాత్మిక. 'దొరసాని' అనే ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది శివాత్మిక. తన నటనతో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనవంతుల కుటుంబంలో పుట్టిన పాత్రలో దొరసానిగా కనిపించి మెప్పించింది.

ఇప్పుడు ఆమె తర్వాత నటించే చిత్రాలపై ఆసక్తి పెరిగింది సినీ అభిమానుల్లో. ఈ నేపథ్యంలోనే శివాత్మిక 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తోందంటూ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీళ్ల కుమార్తెగా శివాత్మిక కనిపించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మరాఠీ చిత్రం 'నటసామ్రాట్‌'కు తెలుగు రీమేక్‌ ఇది.

ఇవీ చూడండి.. 'పండగ'లోని యాక్షన్‌ కోసం తేజ్ సిక్స్ ప్యాక్

ABOUT THE AUTHOR

...view details