Shivarajkumar about puneeth death: తన చిన్న తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని నటుడు శివరాజ్‌కుమార్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సోదరుడు పునీత్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు(puneeth rajkumar death news). పునీత్ కుటుంబానికి తనకి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని అన్నారు.
పునీత్‌ను మర్చిపోలేకపోతున్నా: శివరాజ్‌కుమార్ - శివ రాజ్‌కుమార్ భావోద్వేగం
shivarajkumar gets emotional: తన సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు నటుడు శివరాజ్‌కుమార్. పునీత్ కుటుంబానికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని అన్నారు.
![పునీత్‌ను మర్చిపోలేకపోతున్నా: శివరాజ్‌కుమార్ పునీత్ రాజ్‌కుమార్ శిshivarajkumar gets emotionalవరాజ్కుమార్ భావోద్వేగం, shivarajkumar gets emotional about puneeth rajkumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13760742-thumbnail-3x2-shivarajkumar.jpg)
"పునీత్.. మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు.. శివన్న అని ప్రేమగా పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి బయటకు రావడానికి వర్క్‌పై శ్రద్ధ పెడుతున్నాను. అయినప్పటికీ.. ఎక్కడకి వెళ్లినా పునీత్ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ కన్నీళ్లు ఆగడం లేదు. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత తేరుకొని.. జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఈ భూమిని వీడి వెళ్లాల్సిందే అనే జీవిత సత్యాన్ని గుర్తు తెచ్చుకొని గుండె నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. పునీత్ సతీమణి అశ్వినీ, ఇద్దరు కుమార్తెలకు నాకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను" అని శివరాజ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరని.. మరో అభిమాని ఆత్మహత్య