నటుడు శివాజీరాజా తనయుడు విజయ రాజా హీరోగా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘'జెమ్'’ మూవీని రామనాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు హాజరై బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించే ఈ చిత్రానికి సుశీల సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ రాజాకు జంటగా రాశి సింగ్ నటిస్తుంది.